వైజాగ్ షెడ్యుల్ లో నరేష్ అగస్త్య, రాజేంద్రప్రసాద్, హీరోయిన్ శ్వేత అవస్తి, సెకండ్ హీరోయిన్ ప్రగ్యా నైనా, అలీ రెజాల పై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించారు. దీంతో 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలుంది. ఈ రెండు పాటలని బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మార్చి లో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ.. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం కోసం ఖర్చు చేశారు. వైజాగ్ లో రుషికొండ, తొట్లకొండ బీచ్, యారాడ బీచ్ , అరకు లాంటి అందమైన లోకేషన్స్ లో చిత్రీకరించాం. అవుట్ డోర్ షూటింగ్ కి వైజాగ్ అన్ని విధాల అనుకూలంగా వుంది అని అన్నారు.
ప్రముఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోహిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలు వున్నాయి. అనూప్ రూబెన్స్ బ్యూటీఫుల్ ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఈ చిత్రానికి కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.