ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తూ తాను బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించానని... బాలీవుడ్‌కు వచ్చిన తొలినాళ్లలో తనకు ఓ దర్శకుడు పరిచయం అయ్యాడని... ఎంతో మంచి వ్యక్తిలా తనతో మాట్లాడేవాడని జరీన్ తెలిపింది.
ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని... అందులో ముద్దు సన్నివేశం ఉంటుందని... దానికి ముందుగానే రిహార్సల్స్ చేద్దామని తనను పిలిచి, చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని చెప్పింది. తనను దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడని తెలిపింది.
సినిమా ఆఫర్లను తెప్పించే బాధ్యత తనదే అని చెపుతూ, తనను నమ్మించే ప్రయత్నం చేశాడని చెప్పింది. ఆ తర్వాత అతని బారి నుంచి తాను తప్పించుకున్నానని తెలిపింది. సల్మాన్ సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపీచంద్ సరసన తెరకెక్కిన 'చాణక్య' సినిమాలో కూడా నటించింది.