రెజీనాకు అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా.. ఫంక్షన్లు, ప్రమోషన్ కార్యక్రమాల్లో గ్లామర్‌గా కనిపించి తన కెరీర్‌కు ఢోకా లేదనిపించుకుంటుంది. అయితే అలాంటి ఓ బాలీవుడ్ సినిమా కార్యక్రమానికి వేసుకొచ్చిన డ్రెస్ ఆమెను అభాసుపాలు చేసింది. బాలీవుడ్ అవకాశం దొరికింది కదాని.. కాస్త గ్లామర్ డోస్ పెంచాలనుకున్న రెజీనాకు అవమానమే జరిగింది.
ఇంతకీ విషయం ఏమిటంటే..? బాలీవుడ్ గ్రేట్స్ అమితాబ్, అనిల్ కపూర్లతో కలిసి 'అంఖైన్-2' సినిమాలో నటించే చాన్సు వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్లో రెజీనా వేసుకొచ్చిన డ్రస్ ఆమెను అభాసుపాలు చేసింది. ఆ ఫిల్మ్ లాంచింగ్ కార్యక్రమం ముంబైలో గురువారం ఘనంగా జరిగింది. ఆ సందర్భంగా రెజీనా ఓ స్టేజ్ ఫెర్మార్మెన్స్ ఇచ్చింది. అయితే ఆమె వేసుకొచ్చిన సెక్సీ ఔట్ఫిట్ ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
అయితే ఫోటోగ్రాఫర్లు చేసిన పనికి రెజీనా షాక్ తింది. రెజీనా తలపట్టుకుని కూర్చుంది. ఎందుకిలా అయ్యిందని ఫీలయ్యింది. ఓ మైగాడ్ ఏం జరిగిందంటూ చాలాసేపు కామ్‌గా ఉండిపోయింది. తాను బాలీవుడ్‌కు ఇలా పరిచయం కావడం బాధగా ఉందని తెలిపింది. కానీ టీమ్ సభ్యులు ధైర్యం చెప్పారని.. సినీ ఫంక్షన్లో ఇలాంటివి కామనేనని.. భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనేమీ లేదని రెజీనా మీడియాపై విరుచుకుపడింది. మొత్తానికి రెజీనా బాలీవుడ్ తెరంగేట్రాన్ని జీవితంలో మరిచిపోదు. ఇలాంటి అవమానాలు భరించడం కంటే నీట్‌గా డ్రెస్సులేసుకునే దానిపై ఇక రెజీనా దృష్టి పెడ్తే బెస్టని సినీ పండితులు అంటున్నారు.