హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె కేవలం ఒక హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, దర్శకురాలిగా, నిర్మాతగా ఉన్నారు. పైగా, ఈమెలో దాగివున్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ సమాజంలో జరిగే పలు సంఘటనలపై తన మనసులోని మాటను బహిర్గతం చేస్తుంటారు.
ఒక్కోసారి భావోద్వేగపూరితంగా కవితలు రాసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యల ఫోటోలని షేర్ చేస్తూ చిన్న కవిత రాసింది. "ఒక హృదయం, ఒక ఆత్మ, మీకోసం నా ప్రాణాలు ఇస్తాను, మీ కోసం ప్రాణాలు తీస్తాను" తన పిల్లల కోసం తల్లి రాసిన చిన్న కవిత... నేను క్యూటీస్ ఫోటోలని తీస్తూనే ఉంటాను ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది రేణూ దేశాయ్. ఆ కవితను మీరూ చదవండి.