పవన్ కళ్యాణ్ సినిమా చేయట్లేదు.. బండ్ల గణేష్

గురువారం, 30 మే 2019 (12:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో డీలాపడిన జనసేనాని పవన్ ఇకపై సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారని బోలెడు వార్తలు పుట్టుకొచ్చాయి. ముందుగా బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా చేస్తారని, ఆ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగింది. 
 
ఈ చిత్ర బడ్జెట్ 100 కోట్ల పైమాటే ఉంటుందని ప్రచారం జరిగింది. కాగా ఈ పుకార్లను నిర్మాత బండ్ల గణేష్ కొట్టిపారేశారు. ఈ వార్తలపై స్పందించిన ఆయన తన బ్యానర్లో ప్రస్తుతం సినిమా ఏదీ చేయడం లేదని, ఒకవేళ ఏదైనా ఉంటే తానే స్వయంగా చెబుతానని అన్నారు. దీంతో పవన్ మళ్లీ సినిమా పరిశ్రమకే తిరిగి వస్తారనే వార్తలపై సందిగ్ధం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు