'కాటమరాయుడు' పవన్ లుంగీ లుక్స్... పవన్ ఫ్యాన్స్ కిర్రాక్....

శుక్రవారం, 30 డిశెంబరు 2016 (13:29 IST)
నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు చిత్రానికి సంబంధించి పవన్ లుంగీ లుక్స్ కొన్నింటిని విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా వరసబెట్టి రకరకాల యాంగిల్స్‌లో పవన్ లుంగీ కట్టుకుని నడుస్తున్న పోస్టర్లను పోస్ట్ చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కొందరు సెటైర్లు వేస్తున్నారు. మొట్టమొదటిసారిగా విడుదల చేసిన ప్రి-లుక్ ఓకే కానీ ఆ తర్వాత వరసబెట్టి వదులుతున్న లుక్స్ చూడ్డం తమవల్ల కావడం లేదని అంటున్నారు. 
 
పవన్ కళ్యాణ్ సైడ్ ఏంగిల్, బ్యాక్ లుక్ లో లుంగీ కట్టుకుని నిలబడి ఉన్నట్లుగా విడుదల చేసిన పోస్టర్స్ చాలా బాగా లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చిందో బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, లుక్స్ కే ఇలా అంటే చిత్రం విడుదలయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

వెబ్దునియా పై చదవండి