వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు.. పవన్ పార్టీకి వెళ్లేది లేదు.. అలీ

గురువారం, 29 సెప్టెంబరు 2022 (09:23 IST)
ALi_Jagan
ప్రముఖ సినీ నటుడు అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా, ఆయన ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
దీనిపై కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని అలీ ఫైర్ అయ్యారు. తాను వైఎస్సార్ పార్టీని వీడేది లేదని అలీ స్పష్టం చేశారు. పదవులు, ప్రయారిటీల కోసం తాను వైసీపీలో చేరలేదన్నారు. 
 
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలనే లక్ష్యంతోనే తాను వైసీపీలో పనిచేశానని అలీ చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. జగన్ మనసులో స్థానం ముఖ్యమని స్పష్టం చేశారు. 
 
మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో అంకితభావంతో పనిచేస్తానని అలీ స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి చెయ్యనిది మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేశారని అలీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు