ఐటమ్ గర్ల్‌గా మారనున్న పవన్ కల్యాణ్ రీల్ సిస్టర్ సంధ్య!

మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (15:14 IST)
పవన్ కల్యాణ్ రీల్ సిస్టర్ అదేనండీ.. అన్నవరంలో పవర్ స్టార్ చెల్లెలుగా నటించిన సంధ్య ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తనుంది. పవన్ కల్యాణ్ సోదరిగా పద్ధతిగా నటించిన సంధ్యకు అవకాశాలు రాకపోవడంతో ఇక లాభం లేదనకుని.. ఐటమ్ గర్ల్‌గా బరిలోకి దిగనుంది. ప్రేమిస్తే సంధ్యగా 2010లో బాగా పేరు కొట్టేసిన సంధ్య.. తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు అంతంత మాత్రంగా రావడంతో వెండితెరకు ఐదేళ్ల పాటు బాగా గ్యాప్ ఇచ్చేసింది. 
 
చాలా గ్యాప్ తర్వాత తమిళ సినిమా కత్తుక్కుట్టిలో సంధ్య ఐటమ్ గర్ల్‌గా మారనుంది. తమిళ కమెడియన్ సూరితో పాటు సంధ్య చిందులేయనుంది. అయితే సంధ్య ఐటమ్ గర్ల్‌గా అవతారమెత్తితే ఇక హోమ్లీ ఛాన్సులు సన్నగిల్లుతాయని కోలీవుడ్ సినీ పండితులు అంటున్నారు. కానీ ఐటమ్ సాంగ్స్‌తో చేసినంత మాత్రానా హోమ్లీ రోల్స్ దూరం కావని చెప్పడం తాను నమ్మనని, సూరి కోసం చేసే ఐటమ్ సాంగ్‌లో అసభ్యత ఏమాత్రం ఉండబోదని సంధ్య సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి