సమన్వయ లోపంతోనే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారుః బన్నీవాసు
బుధవారం, 13 అక్టోబరు 2021 (18:23 IST)
Bannivasu
పెండ్లికాకముందు బేచలర్‌గా పిలవడం మామూలే. కానీ పెల్ళయ్యాక కూడా అతన్ని మోస్ట్ ఎలిజిబుల్ బేచ్‌లర్ అని ఎందుకు పిలుస్తారనేది సినిమా కథ అని నిర్మాత బన్నీవాసు చెప్పారు. ఈనెల 15న విడుదలకానున్న ఈ సినిమా గురించి బుధవారంనాడు విలేకరులతో మాట్లాడారు.
- ఈ సినిమా కథ వినాగానే ఎంతగానో నచ్చింది. ప్రతి వ్యక్తికి కనెక్ట్ అవుతుంది. పెండ్లికానివారికి పెండ్లయిన వారిని టచ్ చేస్తుంది.
- పూజ హెగ్డే, అఖిల్ ఇద్దరు పాత్రలు జీవించారనే చెప్పాలి. బాగా సెట్ అయ్యారు. అఖిల్ హైలెవల్ కుర్రాడిగా కనిపిస్తాడు. ఈ కథకు కూడా అలాంటి వాడే కావాలి. అందుకే అతన్ని ఎంపిక చేశాం.
- మా బేనర్‌లో నాగచైతన్యకు 100%లవ్ అనే సక్సెస్ వచ్చింది. అలాగే అఖిల్ కూడా ఈ సినిమా వస్తుందనే నమ్మకముంది.
- దర్శఖుడు భాస్కర్ తాను అనుకున్నది అనుకున్నట్లు తీశాడు. కుటుంబ కథా చిత్రాలు తీయడంలో ఆయన దిట్ట. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాగా అవుతుంది. స్టాండప్ కామెడీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఇందులో హీరోయిన్ పాత్ర ద్వారా పరిచయం చేశారు.
- ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ పెద్దలు కొన్ని ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతున్నారు. దీనిపై లేటెస్ట్ గా మాట్లాడారు నిర్మాత బన్నీ వాస్.
– ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మంత్రిని కలిశాం. AP ప్రభుత్వం చిత్ర పరిశ్రమపై వివక్షత చూపుతుంది అనే ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు. ప్రభుత్వం పరిశ్రమ మంచి చెడులు ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకునే పనిలో ఉంది.
– ఇటీవలే కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆయనకి ఇండస్ట్రీ నుండి సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్లే అలా మాట్లాడారు. ఇటీవలే ఆయన్ను కలిసి ప్రాపర్ గా కమ్యూనికేట్ చేశాం. అలాగే ఈ విషయాన్ని ఇంక పొడిగించవద్దని కూడా ఇటు కళ్యాణ్ గారిని అటు ప్రభుత్వాన్ని కోరాము. అలాగే ప్రభుత్వం మాతో ఏ విషయాల గురించి చర్చిస్తుంది. అసలు ఆన్లైన్ టికెటింగ్ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అనేది ఎవరికీ తెలియడం లేదు.
– నిజానికి ఆన్లైన్ టికేటింగ్ తో అంతా మంచే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇక ఆంధ్రాలో నిజాయితీగా ట్యాక్స్ లు చెల్లించకపోవడం వల్లే ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తుంది. దీని వల్ల అటు ప్రభుత్వానికి , ఇటు ప్రేక్షలులకి మాకు మంచే జరుగుతుందని భవిస్తున్నాను. మేము ప్రభుత్వ ప్రతినిధులను కలిసిన వెంటనే ట్యాక్స్ చెల్లింపులపై వారు రిపోర్ట్ చూపిస్తే ఆశ్చర్య పోయాము. వారితో ఏం మాట్లాడలేకపోయాం. ముఖ్యంగా భారీ స్థాయిలో కలెక్ట్ చేసిన పెద్ద సినిమాలకు కూడా తక్కువ ట్యాక్స్ కట్టారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ప్రస్తుతానికి ఆన్లైన్ టికెటింగ్ మీద చర్చ జరుగుతుంది. ప్రాసెస్ ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది.
– అలాగే AP లో కర్ఫ్యూ పూర్తిగా సడలించడానికి టైం పడుతుందని, హెల్త్ డిపార్ట్ మెంట్ నుండి సడలింపు పై క్లారిటీ రావాల్సి ఉందని ఆయన అన్నారు. దసరా నుండి సెకండ్ షో , అలాగే 100% ఆక్యుపెన్సీ ఇవ్వమని ఆడిగామని కానీ ఇప్పుడే అది కుదరదని తెలుసుకున్నామని బన్నీ వాస్ తెలిపారు.