ప్రస్తుతం వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లు తన వ్యక్తిగత ఇమేజ్‌ని అవమానించే విధంగా వున్నాయని.. పవర్ స్టార్ సతీమణి అన్నా లేజీనోవా కోర్టులో కేసు వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమా తనని, తన భర్తని కించపరిచే విధంగా ఉందని ఆమె భావించి పవన్ కళ్యాణ్ నిర్ణయంతో కోర్టులో కేసు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే వర్మకు మూడినట్టేనని సినీ జనం అనుకుంటున్నారు.
చాలా రోజుల క్రితం పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమా, ఆ తర్వాత ఇటీవలే అదే పోర్న్ భామతో 'క్లైమాక్స్' సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఆపై తెలుగమ్మాయి శ్రీ రాపాకతో హాట్ మూవీ 'నగ్నం' అనే మూవీతో యూత్‌ను బాగానే ఆకట్టుకున్నాడు.