షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... అన్నయ్య చిరంజీవి ఇంటికెళ్లి విషెస్

శనివారం, 22 ఆగస్టు 2015 (18:25 IST)
పవన్ కళ్యాణ్ తమ అన్నదమ్ముల అనుబంధం గురించి ఎప్పుడూ చిలవలుపలవలుగా వార్తలు రాసేవారికి గట్టి షాక్ ఇచ్చారు. శనివారం నాడు, ఆగస్టు 22న చిరంజీవి 60వ పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
అంతేకాదు... చిరంజీవి కుటుంబ సభ్యులతో సుమారు 45 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. కాగా ఈ సాయంత్రం హోటల్లో జరిగే ఫంక్షనుకు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నయ్య ఇంటికెళ్లి భేటీ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

వెబ్దునియా పై చదవండి