హీరో నితిన్ గాలిలో తేలాడుతున్నాడు. కలల ప్రపంచంలో విహరిస్తున్నాడు. ఇంతకీ ఏం జరిగిందయా అంటే... తను దేవుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ ఆధ్వర్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నితిన్ హీరోగా నటించడమే. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాదులో జరిగాయి. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.