సాహో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన చిత్ర నిర్మాత‌లు...

శనివారం, 20 జులై 2019 (15:07 IST)
బాహుబలి చిత్రం తరువాత ప్ర‌పంచ సినిమా బాక్సాఫీస్ ఒక్క‌సారిగా యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో చిత్రం వైపుకి మళ్లిన‌ విష‌యం తెలిసిందే. బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్‌తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమాపై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్‌కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటితో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 
 
హైస్టాండ‌ర్డ్ విఎఫ్ఎక్స్‌ని యూజ్ చేయ‌టం వ‌ల‌న హ‌డావిడి కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న సినిమా ల‌వ‌ర్స్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబంధించిన‌ వ‌ర్క్ జ‌రుగుతుంది. క్రిస్ట‌ల్ క్లారిటిగా రెబ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. 
 
ఈ చిత్ర నిర్మాత‌లు వంశీ -ప్ర‌మోద్‌-విక్ర‌మ్‌లు మాట్లాడుతూ.. మా బ్యాన‌ర్లో వ‌చ్చిన అన్ని చిత్రాలు క్వాలిటికి కేరాఫ్‌గా వ‌చ్చాయి. మ‌రి ఇప్పుడు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా సాహో లాంటి చిత్రాన్ని చేస్తున్నాము. అది కూడా బాహుబ‌లి అనే ల్యాండ్ మార్క్ చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం సినిమా ప్రేక్ష‌కులంద‌రూ అంచ‌నాలు అందుకోవాలి. 
 
అందుకే చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. విఎఫ్ఎక్స్ కూడా అదే రేంజ్‌లో వుండేలా కేర్ తీసుకుంటున్నాం. ఇంత లార్జ్ స్కేల్లో వ‌స్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కి బెస్ట్‌గా ఇవ్వాల‌న్న మా ప్ర‌య‌త్నం కొంచెం ఆల‌స్య‌మైనా బెస్ట్ ఇచ్చి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అగ‌స్టు 30న ఈ చిత్రాన్ని ప్ర‌పంచంలో వున్న సినిమా ల‌వ‌ర్స్‌కి అందిస్తున్నాము అని అన్నారు.
 
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు