బాలీవుడ్ బిగ్ బీని కలవడం తనకు ఆనందంగా ఉందని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తెలిపాడు. ముంబైలోని లెజెండ్ నివాసానికి వెళ్లి అమితాబ్‌ని కలిశానని ప్రకాశ్‌రాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆయనను కలిసినప్పుడు అమితాబ్ చూపించిన ప్రేమానురాగాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవని, ఆయన ఆప్యాయతలకు పొంగిపోయానని ప్రకాశ్ రాజ్ తెలిపాడు.
ఇంత ఏజ్‌లో కూడా ఆయన ఎనర్జీ చూసి తాను ఎనర్జీగా ఫీలవుతున్నానని ప్రకాశ్ రాజ్ తెలిపాడు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ తాను నటిస్తూ నిర్మిస్తున్న 'మన వూరి రామాయణం'చిత్రం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.