రైతుల‌కు అకౌంట‌బులిటీ వుండాలంటున్న ప్ర‌కాష్‌రాజ్‌

సోమవారం, 10 అక్టోబరు 2022 (19:06 IST)
Prakashraj with formers
సినిమాల్లో రైతుల గురించి ఇలా వుండండి, అలా వుండండి. అంటూ చెప్ప‌డం కాదు. అలాగే రాజ‌కీయాల్లో వున్న‌వారు రైతే రాజు అంటారు. కానీ రాజు కాదు కూలీ అయ్యాడంటూ.. న‌టుడు, వ్య‌వ‌సాయ‌దారుడు అయిన ప్ర‌కాష్ రాజ్ తెలియ‌జేస్తున్నాడు. సినిమాల్లో బిజీగా వున్నా త‌న‌కు చెందిన వ్య‌వ‌సాయ క్షేత్రంతోపాటు శంషాబాద్ చుట్టుప‌క్క‌ల రైతుల సాధ‌క బాధ‌లు తెలుసుకుని వారిచేత పంటలు పండిస్తూ 50 ఎక‌రాల సాగును చేస్తున్నారు. వ‌రిలో ప‌లు ర‌కాల పంట‌ను ఆయ‌న ప‌రిశీలించారు. 
 
ఈ సంద‌ర్భంగా ఆదివారంనాడు ఇందూరులో (నిజామాబాద్ కు అస‌లు పేరు) దిల్ రాజుకు చెందిన 25 ఎక‌రాల పొలాన్ని ఎరువులు లేకుండా సాగు చేస్తున్న రైతుల‌ను క‌లిసి వారి సాధ‌క‌బాధ‌లు విని వారిని చైత‌న్య‌వంతులు చేశారు. ప్ర‌కాష్‌రాజ్ మాట్లాడుతూ, నా పొలం ప‌క్క‌నే కొంద‌రు రైతులున్నారు. వారికి ల‌క్ష రూపాయ‌లు మిగులు క‌నిపించింద‌ని ఆ రైతులు చెప్పారు. ఎలా? అంటూ నేను అడిగాను. అవీ ఇవీ లెక్క‌లు చెప్పారు. ఫైన‌ల్‌గా నీ శ్ర‌మ‌తోపాటు ఆ ఖ‌ర్చు ఈ ఖ‌ర్చు పోనూ సంవ‌త్స‌రానికి వ‌చ్చింది 25వేలే క‌దా అని వివ‌రించా. అప్పుడు నిజం తెలుసుకుని త‌నూ కొంత‌మంది రైతుల‌ను క‌లుపుకుని నేను చెప్పిన ప‌ద్ధ‌తిలో సాగు చేస్తున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా వున్నారంటూ.. అక్క‌డి రైతుల‌కు చెప్పాడు.
 
అంతే కాక రైతు అనేవారికి అకౌంట‌బులిటీ కూడా వుండాలి. పంట పండించింది బ‌జారున అమ్ముకునే క్ర‌మంలో ద‌ళారుల చేతికి చిక్క‌వ‌ద్దు. మీరంతా క‌లిసి క‌ట్టుగా ఓ ధ‌ర నిర్ణ‌యించి దానిని మీకు అనుకూలంగా వున్న‌వారికి అమ్మండి. మీరు యూనిటీగా వుండాలి. ఇదే నేను మీకు చెప్పేది ..అంటూ వివ‌రించారు. అందుకు మిగిలిన రైతులు మీరు చెప్పిన విధంగా న‌డుస్తామ‌ని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు