అమెరికన్ బాయ్‌ఫ్రెండ్‌తో ప్రీతి జింటాకు డుం.. డుం.. డుం..
సోమవారం, 23 నవంబరు 2015 (14:11 IST)
బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నట్లు బిటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కొత్త సంవత్సరం జనవరి 2016నఅమ్మడు అమెరికన్ బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనుందని వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ కోసం అప్పుడప్పుడు అమెరికా వెళ్లే ప్రీతి జింటా.. మంచి ఫ్రెండ్ అయిన తన బాయ్ ఫ్రెండ్‌నే భాగస్వామిగా ఎంచుకోవాలనుకుంది. అంతేగాకుండా పెళ్లికి తర్వాత సినిమాలకు కూడా స్వస్తి చెప్పాలని ఈ సొట్ట బుగ్గల సుందరి భావిస్తున్నట్లు తెలుస్తోంది.