హీరోయిన్లు మెగాఫోన్ పట్టిన కాలం ఎప్పుడో వచ్చేసింది. హీరోలతో సమానంగా నటించడమే కాదు.. హీరోలు మాత్రమే కాదు.. తాముకూడా దర్శకులుగా మారుతామని కథానాయికలు ముందుకొస్తున్నారు. తెలుగు విజయనిర్మల, జీవిత రాజశేఖర్.. తమిళంలో శ్రీప్రియ కూడా దృశ్యం సినిమాతో మెగా ఫోన్ పట్టింది. ఇప్పుడు వీరి బాటలోనే నడవడానికి హాట్ బ్యూటీ ప్రియమణి కూడా రెడీ అయిపోతోంది.
ఈ మధ్య కన్నడ సూపర్ స్టార్ సుదీప్ నిర్వహించే ‘బిగ్ బాస్’ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రియమణి.. సుదీప్ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలన్నది తన కల అని వెల్లడించింది. ప్రియమణి ఏదో తమాషాకు అంటోందని అనుకున్నారు కానీ.. తాను నిజంగానే డైరెక్షన్ చేయలన్న ప్లాన్ తో ఉన్నానని.. త్వరలోనే సినిమా కూడా మొదలు కావచ్చని చెప్పి షాకిచ్చింది ప్రియమణి.