బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు అమెరికా అధినేత బరాక్ ఒబామా విందు ఇచ్చారు. తన పదవీ కాలంలో ఒబామా ఇచ్చిన చివరి కరస్పాండెంట్స్ డిన్నర్ ఇదే కావడం గమనార్హం. క్వాంటికో సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా 1990లో సూపర్ హిట్ అయిన టీవీ సిరీస్ బేవాచ్ ఆధారంగా సాగే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రియాంక చోప్రా ట్వీట్ చేస్తూ.. ఒబామా, మిషెల్లీతో కలిసి డిన్నర్ చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. 2016 వైట్ హౌస్ కరెస్పాండెట్స్ నిర్వహించిన విందుకు ప్రియాంకను ఇటీవల ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. కాగా ఒబామా ఇచ్చిన కరస్పాండెంట్స్ విందులో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ మెంబర్స్, రిపోర్టర్లు, నిర్మాతలు, కెమెరా ఆపరేటర్లు, జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు.