పెళ్లికి ముందే ఓ కండిషన్ వుంది : ప్రియాంకా చోప్రా

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:41 IST)
వివాహానికి ముందు నిక్‌జొనాస్‌కి తనకి మధ్య ఓ ఒప్పందం ఉందని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తెలిపారు. గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి హాలీవుడ్‌ గాయకుడు నిక్‌జొనాస్‌ను 2018లో ప్రేమ వివాహమాడింది. 
 
ప్రస్తుతం ఈ జంట లాస్‌ ఏంజెల్స్‌లో నివాసముంటోంది. ఇక, పెళ్లి తర్వాత కూడా విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రియాంక తాజాగా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్‌జొనాస్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.
 
"వివాహానికి ముందు వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నేనైతే ఇటు భారత్‌తోపాటు అటు విదేశాల్లో కూడా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మేమిద్దరం ఓ నియమం పెట్టుకున్నాం. 
 
అదేమిటంటే.. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నాసరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకు ఒకసారి మేమిద్దరం కలవాలి. మాకు మేము సమయం కేటాయించుకోవాలి. సమన్వయంతో ప్రతి పనిని పూర్తి చేయాలి. ఇలా మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుని మా బంధాన్ని ఏడడుగుల వైపు వచ్చేలా చేశాం" అని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు