దగ్గుబాటి రానా.. బాహుబలి సినిమా తర్వాత ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్‌తో రానా వరుసగా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ అయ్యాడు. ఓవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే... మరోవైపు తమిళ్, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రానా నటించిన అరణ్య అనే సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.
అయితే.. రానా ప్రేమ గురించి తండ్రి సురేష్ బాబు స్పందించారు. ఇంతకీ.. సురేష్ బాబు ఏమన్నారంటే... అందరిలాగే నేను కూడా షాక్ అయ్యాను అని చెప్పారు. రానా - మిహీక మంచి ఫ్రెండ్స్ అని తెలుసు కానీ.. ప్రేమలో ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయామన్నారు. లాక్ డౌన్ వలన ఎలాంటి పనులు లేక చాలా బోర్‌గా ఉందని.. ఇప్పుడు రానా చెప్పిన వార్త వలన చాలా పని పడింది. డిసెంబర్ లోపు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని సురేష్ బాబు చెప్పారు. అయితే.. పెళ్లి ఎక్కడ చేయనున్నారు..? అనేది మాత్రం తెలియచేయలేదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రానా పెళ్లి గురించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.