పూరికి జ‌న‌గ‌ణ‌మ‌న హీరో దొరికేసాడు... ఇంత‌కీ ఎవ‌రా హీరో..?

శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (18:01 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్... ఎప్ప‌టి నుంచో తీయాల‌నుకుంటున్న సినిమా జ‌న‌గ‌ణ‌మ‌న‌. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఈ సినిమా తీయాల‌నుకున్నాడు. మ‌హేష్ కూడా ఓకే అన్నాడు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ల‌లేదు. ఆ త‌ర్వాత ఈ క‌థ‌ను విక్ట‌రీ వెంక‌టేష్ చెప్పాడు పూరి. 
 
వెంకీకి ఈ క‌థ చాలా బాగా న‌చ్చింది. వెంట‌నే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు అయితే... దీనికి బ‌డ్జెట్ కాస్త ఎక్కువు అవుతుంది. వెంకీతో వ‌ర్క‌వుట్ కాద‌నే ఉద్దేశ్యంతో ఇక్క‌డ కూడా ముందుకు వెళ్ల‌కుండా ఆగింది. క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.
 
ఇదిలా ఉంటే...తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న చేయ‌నున్నాడు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయదేవరకొండతో చేస్తున్న ఫైట‌ర్ మూవీ పూర్తైన త‌ర్వాత ప్ర‌భాస్‌తో జనగణమన సెట్స్ పైకి వెళుతుంద‌ని స‌మాచారం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు