పెద్ద నోట్ల సెగ తాకని టాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా?

బుధవారం, 23 నవంబరు 2016 (12:14 IST)
ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ప్రతి ఒక్కరూ తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు అయితే లెక్కకు మించిన కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటున్నారు.
 
ఇకపోతే సెలెబ్రిటీలు, నల్లకుబేరులు అయితే తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఏ విధంగా తెల్లధనంగా మార్చుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు సెలెబ్రిటీల వద్ద చెల్లని నోట్ల కట్టలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. 
 
అయితే, హీరో, దర్శకుడు, నిర్మాత అయిన ఆర్. నారాయణ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతానికి లోబడే ఈయన సినిమాలు చేస్తారు. దాంతో ఆయన దగ్గర మంచి సినిమా తీశానన్న సంతృప్తి తప్ప పెద్ద నోట్లు జమకావు. ఈ కారణంగానే మోదీ నోట్ల సెగకు అందరూ విలవిల్లాడుతుంటే ఆయన మాత్రం బిందాస్‌గా ఉన్నారని టాలీవుడ్‌ జనాలు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి