వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'రాధేశ్యామ్' - 2 రోజుల్లో రూ.119 వసూళ్లు!

ఆదివారం, 13 మార్చి 2022 (15:09 IST)
పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్" ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తుంది. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన మాగ్నమ్ ఓపస్ అద్భుతమైన రెస్పాన్స్‌తో మొదలైంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గత రెండు రోజుల్లో ఏకంగా రూ.119 కోట్ల వసూళ్లను రాబట్టింది. 
 
తొలిరోజు రూ.79 కోట్లకుపైగా వసూలు చేసి, మహమ్మారి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'రాధేశ్యామ్' నిలిచిన విషయం తెల్సిందే. అలాగే, అల్లు అర్జున్ "పుష్ప" చిత్రం సాధించిన కలెక్షన్లను అధికమించింది. 
 
ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణకుమార్ తెరకెక్కించారు. ప్రస్తుతం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తుంది. దీంతో అతిత్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ వ్యాపారంలో రూ.200+ కోట్లను దాటే అవకాశం ఉందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 
 
'రాధేశ్యామ్' ప్రేక్షకులకు అత్యాధునిక విజువల్స్ ఎఫెక్ట్స్, ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య లవ్ కెమెస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు