అయినప్పటికీ ఆమె ఇప్పటివరకు పెదవి విప్పలేదు. అయితే, ఈ విజువల్స్ మరింత వైరల్గా మారడంతో స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ... 'దీనిపై నేనేమీ స్పందించలేను. నిజం చెప్పాలంటే, ఏ చిత్రంలోని నగ్న సన్నివేశాలైనా ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాల్లో నటించాలి. కానీ, వీటిని బహిరంగంగా ప్రదర్శించకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. ఆ విధంగా ఆలోచించడంలో అర్థం లేదు' ఆమె చెప్పుకొచ్చింది.
కాగా, ఈ చిత్రంలో తనిష్టా ఛటర్జీ, సుర్వీన్ చావ్లా, అదితి గుప్తా, ఆదిల్ హుస్సేన్ తదితరులు నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘పార్చ్ డ్’ ఇప్పటివరకు 18 పురస్కారాలను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు దేశాల్లో విడుదలైన ఈ చిత్రం స్వదేశంలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.