నటి రెజీనా ఈరోజే ఓ వ్యక్తితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే అతను ఆమె ప్రియుడంటూ.. నెటిజన్లు స్పందించారు. ఇప్పటికే టాలీవుడ్‌లో యువ హీరోలతో చాలా దగ్గరగా వుండటంతో వారిలో ఎవరితోనైనా ఎఫైర్ వుందేమోనని అనుమానం వుండేది. కానీ అదేమిలేదని చెప్పేది. తాజాగా ఈ ఫొటో ఏమిటా? అని ఆలోచిస్తే.. ఆ వెంటనే మరలా పోస్ట్ చేసింది. తనకు టెన్నిస్ నేర్పే కోచ్ విక్రమ్ ఆదిత్యతో దిగిన ఫొటో ఇది అంటూ తేల్చింది.
ఏది ఏమైనా.. ఇదంతా ముందు జరగబోయే పరిణామానికి నిదర్శనంగా కోచ్ ఫొటో పెట్టి.. ఇంత పబ్లిసిటీ ఎందుకు చేసిందనేది పలు అనుమానాలకు తావిచ్చింది. భవిష్యత్‌లో ఇతనితోనే ఫిక్స్ అయినా ఆశ్చర్యం లేదనే వార్తలు విన్పిస్తున్నాయి. అయితే.. ఇక్కడే చిన్న ట్విస్ట్ కూడా వుంది. తమిళంలో అథర్వ మురళి హీరోగా తను హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తుంది. ఆ చిత్రం ప్రమోషన్‌లో మీడియా పలు ప్రశ్నలు వేస్తే.. తప్పించుకునేందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేసి.. వ్యక్తిగత ప్రయోజానాన్ని పొందుతుందేమోనని వార్తలు విన్పిస్తున్నాయి.