కొంద‌రికే మేజిక్ చేసే రెహమాన్ `99సాంగ్స్‌`

శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (16:44 IST)
99 Songs still
న‌టీన‌టులుః ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ, మనీషా కొయిరాలా త‌దిత‌రుల‌.
సినిమాటోగ్రఫీః తనయ్ సతమ్, జేమ్స్ కౌలీ, ద‌ర్శ‌క‌త్వంః విశ్వేష్‌ కృష్ణ‌మూర్తి.
 
ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ నిర్మాత‌గా మారి క‌థ‌నుకూడా స‌మ‌కూర్చుకుని `99 సాంగ్స్`అంటూ ముందుకు వ‌చ్చాడు. అత‌ని సంగీతం నినాదంగా డ్రెగ్‌లాగా మ‌త్తెక్కిస్తుంది. రోజా నుంచి ఐ సినిమాల వ‌ర‌కు చూసుకుంటే చాలానేవున్నాయి. పాశ్చాత్య బాణీలు పుణికిపుచ్చుకున్న ఆయ‌న హీరో హీరోయిన్లుగా కొత్త‌వారిని ప‌రిచయం చేస్తూ తీశారు. హిందీలో రూపొందిన ఈ సినిమాను త‌మిళం, తెలుగు భాష‌ల్లో కూడా విడుద‌ల చేశారు. అయితే క‌రోనా వ‌ల్ల హిందీలో విడుద‌ల కాలేద‌నే చెప్పాలి. మ‌రోవైపు మిగితా చోట్ల అటువంటి ఇబ్బంది వున్నా ధైర్యంగా ఈ శుక్ర‌వార‌మే విడుద‌ల చేశారు. మరి ప్రేక్షకుల అంచనాలను రెహమాన్ సినిమా అందుకుందో లేదో తెలుసుకుందాం.
 
క‌థః
త‌ల్లి లేని జయ్ (ఇహాన్ భట్) కు చిన్న‌త‌నం నుంచీ సంగీతమంటే ప్రాణం. అదే మ‌న జీవితాన్ని నాశనం చేసింద‌నీ, దాని జోలికి పోవద్దు అని తండ్రి గ‌ట్ట‌గా మంద‌లిస్తాడు. కానీ క్ర‌మేణా తెలీయ‌కుండానే సంగీతంపై ప్రేమ పెంచుకుంటాడు. యుక్త‌వ‌య‌స్సు వ‌చ్చేస‌రికి గాయ‌కుడిగా మారిపోతాడు. ఆయ‌న పాట‌ల‌కు ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ సింఘానియా (రంజిత్ బారోట్) కుమార్తె సోఫియా  (ఎడిల్సీ వార్గాస్) తో ప్రేమలో పడతాడు. త‌ను మూగ‌ది. అయినా పెళ్ళిచేసుకుంటాన‌ని జ‌య్ ఆమె తండ్రికి చెబుతాడు. తానొక మ్యూజిక్ ఇండ‌స్ట్రీని పెడుతున్నాన‌ని దాన్ని చూసుకోమ‌ని చెబుతాడు సంజ‌య్‌. కానీ త‌ను మ్యుజీషియ‌న్ అవ్వాల‌నే గోల్‌ను చెబుతాడు జ‌య్‌. అలా మాట‌కు మాట పెరిగి 'ఒక్క పాట కాదు సమాజాన్ని ప్రభావితం చేయగల వంద పాటలు తయారు చేసుకురమ్మని జయ్ కు ఛాలెంజ్ విసురుతాడు సంజ‌య్‌.  దానిని స్వీకరించిన జయ్ తన స్నేహితుడు పోలో (టెంజిన్ దల్హా)తో కలిసి షిల్లాంగ్ వెళతాడు. అక్కడ జాజ్ సింగర్ షీలా (లీసారే) పరిచయం కావడంతో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. మ‌రి చివ‌రికి జ‌య్ గోల్ నెర‌వేరిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
విశ్లేష‌ణః
ఎ.ఆర్. రెహమాన్ రాసిన కథ, సంగీతంపై సినిమా, పైగా నిర్మాత అన‌గానే ఎంతో అభిరుచిగా వుంటుంద‌నే భావన క‌లుగుతుంది. మ్యుజీషియ‌న్‌గా హీరో ఎంత క‌ష్ట‌ప‌డ్డాడు అనే కోణంలోనే అత‌నికి ఎదుర‌యిన స‌వాళ్ళుకూడా స‌మాజంలో జ‌రిగే ప‌లు సంఘ‌ట‌న‌ల‌ను, త‌న‌కు తెలిసిన కొన్ని విష‌యాల‌ను రెహ‌మాన్ ఇందులో పొందుప‌రిచారు. అవ‌న్నీ స‌హ‌జంగానే వున్నాయి. కానీ అంత‌కుమించి పురుష స‌మాజంలో మ‌హిళ‌ల ప‌ట్ల వున్న భావ‌న ఏదేశంలోనూ మార‌లేదు. అదే ఇందులో చూపించాడు. క‌ళాకారిణిగా మ‌హిళ పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకుంటే ఆమెపై వున్న ప్రేమ పెళ్ళ‌య్యాక ఒక్క‌సారిగా త‌నకంటే ఎక్క‌వ‌యింద‌నే అసూయ‌, ద్వేషంతో పురుషుడు ఎలా ర‌గిలిపోతాడ‌నేది ఇందులో చ‌క్క‌గా చూపించాడు. మ‌రోవైపు హీరో హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ కాస్త ఆమె తండ్రి విసిరిన స‌వాల్ కార‌ణంగా ఆమె ఎలా మ‌నోవేధ‌న చెందింది. ఇత‌ను ఎలా మారిపోయాడు? అన్న‌దే క‌థ‌నం. దానితో క‌థ మ‌రోరూటుకు వెళ్ళిపోయింది. సంగీతం, మైమ‌రిపించే పాట‌లు వుంటాయ‌నుకుంటే ప్రేక్ష‌కుడి పొర‌పాటే. కానీ సంగీత‌కుటుంబంలో వుండే ఆప్యాయ‌త‌లు, అనురాగాలు, క‌లిసిక‌ట్టుద‌నం అనేది షిల్లాంగ్ ఎపిసోడ్ వాస్త‌వాన్ని క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు.
 
పాల‌ప‌రంగా సోఫియా.. సోఫియా.. అనే పాట‌, హో.. నీ న‌వ్వు. న‌న్ను బానిస చేసే.. అనే పాట‌కు నేప‌థ్య సంగీతం రెహ‌మాన్ బాణీ కినిపంచింది. తనయ్ సతమ్, జేమ్స్ కౌలీ సినిమాటోగ్రఫీ మూవీ మూడ్ కు తగ్గట్టుగా ఉంది. ముగింపులో వ‌చ్చే అమ్మ సాంగ్ చిత్రానికి కీల‌కం. అదొక్క‌టే కాస్త బాగుంది.
 
హీరోహీరోయిన్లు ఇహాన్ భట్, ఎడల్సీ వార్గాస్ కొత్త‌వారు.  హీరోయిన్ మూగ‌ది కాబ‌ట్టి న‌ట‌న‌కు పెద్ద‌గా  ఆస్కారం లేదు. హీరోను మోటివేట్ చేసే రిహబిలేషన్ సెంటర్ నిర్వాహకులురాలి పాత్రలో మనీషా కొయిరాలా, షిల్లాంగ్ రెడ్ మస్కారాలోని జాజ్ సింగర్ గా లీసారే బాగానే చేశారు. హీరో స్నేహితుడు పోలోగా తెన్జిన్ తల్హా నటించాడు.
 
మొత్తంగా క‌ళ‌కారులు ఉన్న‌త‌శిఖ‌రాల‌కు ఎద‌గాలంటే త‌మ‌ను తామే కాపాడుకోవాలి. ఎటువైపు ఏ ఉప‌ద్ర‌వం వ‌చ్చిప‌డుతుంటే చేయ‌ని త‌ప్పుకు ఎలాంటి శిక్ష అనుభ‌వించాల్సి వ‌స్తుందో అనేది గ్ర‌హించాల‌నే సందేశం ఇందులో క‌నిపిస్తుంది. ఇది అంద‌రికీ న‌చ్చే సినిమా కాదు. ఆరంభంలోనే సంగీతం అంటే మేజిక్‌, ఓ మతం, ఓ మ‌త్తు. జ‌నాల చ‌ప్ప‌ట్లే క‌ళాకారుడిని మ‌త్తెక్కిస్తాయి. అనే డైలాగ్ లు వుంటాయి. సినిమా చూశాక అంతాల అంద‌రినీ మ‌త్తెక్కించే మేజిక్ ఇందులో క‌నిపించ‌దు. ఓ వ‌ర్గాన్ని మాత్ర‌మే ఆక‌ట్ట‌కునే సినిమాగా మాత్ర‌మే వుంది.
 
 ట్యాగ్ లైన్ః చ‌ప్ప‌ట్లు కొట్టేంత మేజిక్ చేయ‌ని రెహ‌మాన్ సినిమా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు