యింగ్ కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు`. ఈ చిత్రం ద్వారా కమెడియన్, వై.శ్రీనివాస్ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. డిసెంబర్ 6న విడుదల సినిమాను విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.
ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 6న సినిమాను విడుదల చేస్తున్నారు. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. `జయమ్ము నిశ్చయమ్మురా` రచయిత పరం సూర్యాన్షు ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లేను అందించారు.