ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళిల మూవీ అఫిషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్..!

శనివారం, 3 నవంబరు 2018 (15:04 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించ‌బోయే మాసివ్ మల్టిస్టారర్ సినిమా ప్రారంభోత్స‌వ‌ తేదీని ఖరారు చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలు.. దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సినిమా ఇప్పట్లో ప్రారంభం కాదంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్ పెడుతూ RRR లాంచ్ వీడియోను యూ ట్యూబ్‌లో పెట్టారు. 
 
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రత్యేక తేదీని ఎంపిక చేసుకోవడం విశేషం. ఇంత‌కీ ఆ డేట్ ఎప్పుడంటే... మూడు Rలు తరహాలోనే మూడు 11లు వచ్చేలా.. 11-11-11న ఈ సినిమా ప్రారంభం కానుందని ప్రకటించారు. అయితే, ఇందులో మొదటి 11 రోజును, రెండో 11 నెలను సూచిస్తుంది. మూడో 11.. సమయాన్ని సూచిస్తుంది. మ‌రి..ఈ భారీ ప్రారంభోత్స‌వ వేడుక ఎక్క‌డ నిర్వ‌హిస్తారో..  అతిధులుగా ఎవ‌రెవ‌రు రానున్నారో చూడాలి..!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు