Ramcharan ET corespondent
ఇక నాటునాటు సాంగ్ షూటింగ్ వివరాలు చెబుతూ, ఇది నా సాంగ్ కాదు. పబ్లిక్ సాంగ్. డిఫరెంట్ ఫీపుల్స్, కల్చర్‌కు బాగా కనెక్ట్ అయింది. జపాన్, యు.ఎస్.లో ఈ పాటను ఆదరిస్తున్నారు. ఈ పాటను ఉక్రెయిన్ పేలస్‌లో తీశాం. ఆ టైంలో అధ్యక్షుడు నటుడు అయిన వ్లాదిమిర్ జలెస్కీకూడా హాజరయ్యారు. ఈ పాటను పాలెస్‌దగ్గరే 7రోజులు రిహార్సల్స్ చేశాం. 200 మంది పీపుల్ వచ్చారు. 17 రోజులు షూటింగ్ చేశాం. 17 సార్లు రీటేక్ అయ్యాయి. నేను, ఎన్.టి.ఆర్. కలిసి ఈక్వెల్‌గా డాన్స్ వేయాలి. ఇద్దరివీ సమానంగా అటూఇటూ రావాలి. ఒక్కోసారి 30 డిగ్రీలు, 40 డిగ్రీలు.. తేడా వుందంటూ రాజమౌళి చెప్పేవారు. ఓ దశలో టార్చెర్‌లా అనిపించింది. అయినా ఆ టార్చర్ చాలా ఆనందంగా వుంది అని పేర్కొన్నారు.