బిజీ బిజీగా రజనీకాంత్‌: ఒకేసారి రెండు సినిమాలు.. కబాలి.. రోబోలతో..?!

శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:10 IST)
రజనీకాంత్‌ ఇప్పుడు బిజీగా మారిపోయాడు. ఒకేసారి రెండు సినిమాలపై దృష్టి చేస్తూ తెగ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటి హీరోలు సినిమా తర్వాత సినిమా అంటూ కాలయాపన చేస్తున్న తరుణంలో రజనీకాంత్‌ ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. 
 
కబాలి, రోబో2.0 చిత్రాలు ఒకేసారి షూటింగ్‌, పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కబాలి పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో భాగంగా రజనీ డబ్బింగ్‌ ప్రారంభించార. అదీ కాస్త సగం పూర్తయ్యింది.

మరోవైపు రోబో సీక్వెల్‌లో నటిస్తూనే బిజీగా వున్నాడు. చాలా తక్కువ కాలంలో రెండు చిత్రాలు చేయడం రజనీని కోలివుడ్‌ ప్రశంసిస్తోంది. కబాలిలో డాన్‌గా నటిస్తున్న రజనీ... ఈ మూవీ మరో బాషా తరహా చిత్రమవుతుందని సినీ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి