వినాయకచవితి రజనీకాంత్ "జైలర్" రిలీజ్

మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (13:36 IST)
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం "జైలర్". యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. నిర్మాత కళానిధి మారన్ తన సొంత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానరుపై తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ ముత్తువేల్ పాండ్యన్ అనే పాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని నెలలుగా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంది. అలాగే, చెన్నై శివారు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సినీ స్టూడియోలో కూడా జరిపారు. 
 
ఈ చిత్రాన్ని షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్, సీజీ వర్క్స్ ఆలస్యం కావడంతో విడుదలలో జాప్యం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ పన్నులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి వినాయకచవితికి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉంది. కాగా, ఈ చిత్రంలో రజనీతా పాటు మోహన్ లాల్, సునీల్, శివరాజ్ కుమార్, ప్రియాంకా మోహన్, రమ్యకృష్ణ, యోగిబాబు, వసంత్ రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు