ప్రముఖ దర్శకుడు వినాయక్ చెర్రీకి కొత్త ట్యాగ్ తగిలించారు. బ్రూస్ లీ ఆడియో వేడుకలో వినాయక్ చరణ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. చరణ్ హుందాగా వ్యవహరిస్తాడని, అతడితో సినిమాలు తీసేవారికి మెగా పవర్ స్టార్‌గా కాకుండా రాయల్ చరణ్‌గా కనిపిస్తాడంటూ కొనియాడుతూనే చెర్రీకి కొత్త ట్యాగ్ ఇచ్చాడు. అంతేకాకుండా ‘చరణ్ బార్న్ విత్ గోల్డెన్ హార్ట్’ అని వినాయక్ ఆకాశానికెత్తేశాడు.
చిరంజీవి 150వ సినిమా సంగతుల వివరాలను చెప్పించేందుకు వినాయక్ శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే చిరంజీవి మాత్రం తన స్పీచ్‌లో 150వ సినిమాకు సంబంధించిన ప్రస్తావన ఏమాత్రం తీసుకురాలేదు. అయితే తన 150వ సినిమాకు కథ దొరకలేదని చెప్పను కానీ తన 150వ సినిమా గురించి మరో 15 రోజుల లోపు అధికారక ప్రకటన ఉంటుంది అని చెప్పడంతో చిరంజీవి తన 150వ సినిమాపై నెలకొన్న సస్పెన్స్‌కు త్వరలోనే తెరపడనుంది.