ట్విట్టర్ మాంత్రికుడు ఈ సారి మాట తప్పాడు. సోషియల్ మీడియా ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించేలా, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, తరచూ వార్తలలోకి ఎక్కే దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ. తాజాగా మరో సంచలన ట్వట్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి అసలు మాట్లాడనని చెప్పాడు. కానీ తాజాగా ఆయన గురించి అనవసర కామెంట్లు చేశాడు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అర్జున్‌లను పోల్చుతూ.."ఈ ఇద్దరు మెగా స్టార్ హీరోలలో ఎవరు ఎక్కువ?" అని ప్రశ్నిస్తూ, తన దైన శైలిలో క్లారిటీని ఇచ్చారు.
నిజానికి తానేప్పుడూ బన్నీని పవన్ కళ్యాణ్‌తో కంపేర్ చేయలేదని కానీ 'సరైనోడు' సినిమాతో పవన్ కళ్యాణ్ కంటే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అయ్యారని వర్మ ట్వీట్ చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా కంటే, అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' పెద్ద హిట్‌ని దక్కించుకుందని అందుచేత 'పవన్ కళ్యాణ్ కంటే అల్లూ అర్జున్ ఎక్కువ?' అంటూ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో వర్మ తెలిపారు. కాగా వర్మ అవతలి వారిని కాన్సన్ట్రేట్ చేసే కంటే, తన మీద తాను దృష్టి పెడితే వర్మ మరింత సక్సెస్ కాగలడని ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో సలహా ఇచ్చిన విషయం తెల్సిందే.