టీవీ 5 అనే ఛానల్ అంటే రామ్‌కు అస్సలు పడదు. ఈ టీవీ గతంలో రామ్‌పై లేనిపోని నెగటివ్ రిపోర్ట్స్ ఇచ్చింది. రామ్ సినిమాలను చెత్త సినిమాగా తేల్చేసింది. ఆ సమయంలో రామ్ కూడా ఆ ఛానల్‌పై కోపంతో మండిపడ్డాడు. రామ్ కోపం చూసి ఇక ఆ ఛానల్‌తో రామ్ ఏమాత్రం కలవడని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం అదే ఛానల్లో తన కొత్త సినిమా ''హైపర్'' సినిమా పాటను రిలీజ్ చేయడం అందరికీ షాక్ నిచ్చింది.
రామ్ పరువును అంతగా తీసేసిన ఆ ఛానల్లోనే ప్రస్తుతం తన కొత్త సినిమాను ప్రమోట్ చేయడంపై రామ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక హైపర్ సినిమా సంగతికి వస్తే.. ఈ చిత్రంలో రామ్ సరసన రాశి ఖన్నా నటించగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. 14 రీల్స్ బ్యానర్‌ఫై ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.