ముఖ్యంగా బాలకృష్ణ కుర్చీలో కూర్చొని పెండ్లి మండపం దగ్గర చేసే యాక్షన్ కు ప్రేక్షకుల్లో ఆదరణ లభించింది. అందుకే మహేష్‌బాబు సినిమాకు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని చేయనున్నట్లు తెలియజేస్తున్నారు. మహేష్‌బాబు ఫైట్స్ అంటే అందరికీ తెలిసిందే. రష్‌గా కాకుండా స్టయిలిస్‌గా వుంటాయి. సినిమా సినిమాకు వేరియేషన్ చూపాలని మా అసిస్టెంట్లను, కెమెరామెన్, దర్శకుడు, హీరోలతోపాటు లైట్ బాయ్నుకూడా అడిగి నచ్చితే అప్లయి చేస్తామని రామ్ లక్ష్మణ్‌లు పేర్కొన్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.