సోగ్గాడి సరసన రమ్యకృష్ణ... ఎఫ్బీని ఉపయోగించుకుంటోందట...

బుధవారం, 26 ఆగస్టు 2015 (21:14 IST)
బాహుబలిలో తన పాత్ర ద్వారా అందరినీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు సోగ్గాడే చిన్నినాయనే చిత్రంలో నాగార్జున పక్కన నటిస్తుంది. వీరి కాంబినేషన్‌లో సీన్స్‌ను హైదరాబాద్‌ శివార్లో చిత్రీకరిస్తున్నారు. బాహుబలి పుణ్యమా అని రమ్యకృష్ణ కూడా ఫేస్‌బుక్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంది. అందుకే వెంటనే నాగార్జునతో వున్న స్టిల్‌ను ఫేష్‌బుక్‌లో పెట్టేసింది.
 
తన అభిమాన నటుడు నాగార్జుతో పని చేయడం చాలా ఆనందంగా వుందంటూ కామెంట్‌ చేసింది. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరో పాత్రకు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌. కళ్యాణకృష్ణ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాత.

వెబ్దునియా పై చదవండి