రానా దగ్గుబాటి తన బాబాయ్, నెట్‌ఫ్లిక్స్‌తో మొదటిసారి కలిసి పని చేయడం గురించి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ చాలా కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఇది నెట్‌ఫ్లిక్స్‌తో బాబాయ్ వెంకీతో నా మొదటి కొలాబరేషన్ . ఈ ప్రాజెక్ట్‌లో సుందర్ (ఆరోన్,) కరణ్ (అన్షుమాన్) సుపర్ణ్ (వర్మ)తో కలిసి పని చేయడం ఒక అద్భుతమైన అనుభవం. రానా నాయుడు దానిని అందించినందుకు సంతోషిస్తున్నాను. మొత్తం తారాగణం, టీం ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను. రానా నాయుడు పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించింది. అతను తన కుటుంబంతో లోతైన భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్న సంక్లిష్టమైన పాత్ర, అదే సమయంలో తన తండ్రితో అతని సంబంధంతో కూడా పోరాడే పాత్ర. రానా, నాగ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రపంచాన్ని అందరూ ఎక్స్ పీరియన్స్ చేయడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అన్నారు.
వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ .. రానా నాయుడు లాంటి ఎగ్జైటింగ్ షో కోసం మొదటిసారిగా మా అన్నయ్య గారి అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు థ్రిల్‌గా అనిపించింది. నాగ పాత్రను పోషించడం నాకు పూర్తిగా కొత్త అనుభవం. నేను ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదు. నాగ ఒక రిఫ్రెష్ చేంజ్. ఈ పాత్ర తెలివైన, ఆకర్షణీయమైన లేయర్లుగా వుంటుంది. నా అభిమానులు ఏం చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నాకు చాలా విధాలుగా కొత్తది. ఈ సిరీస్‌లో ప్రతిభావంతులైన దర్శకులు, నిర్మాతల బృందంతో కలిసి పనిచేయడం నిజంగా అద్భుతమైన అనుభవం అన్నారు.