వీరి పెళ్లికి ఇరు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు నాగ చైతన్య, సమంత, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, సుబ్బిరామిరెడ్డి, రాజమౌళి, రామ్ చరణ్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందినట్టు సమాచారం.
ఇక వధువు మెడలో తాళికట్టు శుభవేళ గంటల్లో రానుంది. దాంతో రానా దగ్గుబాటి, తన స్నేహితురాలు మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైంది. ఈ వేడుకకు కేవలం 50 మంది లోపు అతిథులు పాల్గొనే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా రానా దగ్గుబాటి, బాబాయి వెంకటేష్, తండ్రి సురేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. ఇప్పటికే పెళ్లికి హాజరయ్యేవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని దగ్గుబాటి ఫ్యామిలీ కోరింది. ఈ పెళ్లి వేడుకకు రామానాయుడు సినీ విలేజ్ స్టూడియోలో బయో సెక్యూర్ వాతావరణంలో పెళ్లి తంతును నిర్వహించనున్నారు.