బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. నాలుగేళ్లుగా అలియా-రణబీర్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ జంట తమ బంధాన్ని దాచిపెట్టే ప్రయాణం చేయలేదు. వీరిద్దరూ కలిసి నటించిన 'బ్రహ్మాస్త' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.