చారుశీలలో జూలీ గణపతి సీన్లున్నాయి... హైకోర్టు ఏమందో తెలుసా?

బుధవారం, 24 ఆగస్టు 2016 (12:31 IST)
జబర్దస్త్ యాంకర్ రేష్మి ''చారుశీల'' వ్యవహారం హైకోర్టు వరకు వెళ్ళింది. గతంలో తమిళంలో రూపొందించిన సూపర్ హిట్ జూలీ గణపతి మూవీ తమిళ డబ్బింగ్, రీమేక్ రైట్స్‌ను ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమిళంలో బాలు మహేంద్ర దర్శకత్వం వహించగా, ఇళయరాజా సంగీతం సమకూర్చారు. 
 
జూలీ గణపతి చిత్రంలో జయరామ్, సరిత హీరోహీరోయిన్స్‌గా నటించారు. తాజాగా రేష్మి నటించిన చారుశీల చిత్రం జూలీ గణపతి చిత్రానికి దగ్గరగా ఉందని ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు చాలా వరకు చారుశీలలో ఉన్నాయం టూ నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ కోర్టుకెక్కారు. 
 
హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై కోర్టు స్పందిస్తూ.. 24 లోపు నివేదిక సమర్పించాలని సంబంధిత ఫిలించాంబర్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్‌ను కోరింది. దీంతో సి. కల్యాణ్ ఈ రెండు సినిమాలను చూసినట్లు తెలిసింది. ఫలితంగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి