మూడు ముక్కలాట.. మన్మథుడుతో శివరంజని, అనసూయ పోటీ

గురువారం, 1 ఆగస్టు 2019 (18:50 IST)
మన్మథుడు-2తో జబర్దస్త్ యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీగౌతమ్‌లు పోటీపడుతున్నారు. అనసూయ భరద్వాజ్ నటించిన ‘కథనం’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. అదే రోజున కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’ సినిమాతో పోటీ పడుతూ విడుదల కానుంది.
 
ఇక ఈ సినిమాలకు ముందు.. రష్మీ గౌతమ్ శివరంజనితో పలకరించనుంది. రష్మీ నటించిన ‘శివరంజని’ మూవీ ఆగస్టు నెల 2న విడుదల కానుంది. ఇకపోతే.. అనసూయ మాత్రం ఒకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే చిరంజీవి సహా పలు అగ్ర హీరోలు నటించే సినిమాల్లో ముఖ్యపాత్రల్లో నటించాడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అంతేగాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ.. తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల అనసూయ తానా సభలకు వెళ్లింది. అక్కడ ఫ్యామిలీతో దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు