అభిమానులను అడ్డుకోవద్దన్న రష్మిక.. ఫ్యాన్స్ ప్రశంసలు

మంగళవారం, 14 జూన్ 2022 (18:24 IST)
దక్షిణాదిలో ప్రముఖ హీరోల వివిధ సినిమాలలో నటిస్తున్న రష్మిక మందన్నా బాలీవుడ్‌లోనూ పాగా వేసింది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
తనను కలిసి, ఫొటోలు దిగేందుకు వస్తున్న అభిమానులను అడ్డుకోవద్దని సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అభిమానులను అడ్డుకోవద్దని సున్నితంగా హెచ్చరించింది. ఆ తర్వాత అభిమానులతో ఫొటో దిగింది. దీంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు