సాయిధరమ్ తేజ్‌తో నాకు అవకాశాలు రావట్లేదు: రెజీనా

గురువారం, 1 అక్టోబరు 2015 (15:23 IST)
సాయిధరమ్ తేజ్‌తో వరుసగా సినిమాలు చేసినంత మాత్రానికే తనకు అవకాశాలు రావట్లేదని రెజీనా స్పష్టం చేసింది. సాయితో వరుసగా సినిమా చేయడం ద్వారా ఆయనే రెజీనా పేరును దర్శకులు, నిర్మాతలకు సిఫార్సు చేస్తున్నాడని, వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తోందని వస్తున్న వార్తలపై రెజీనా స్పందించింది. మా ఇద్దరి మధ్య ఏ అఫైర్లు నడవట్లేదని తేల్చేసింది. 
 
సాయిధరమ్ తేజతో అనూహ్యంగా నటించేందుకు ఛాన్సులు వస్తున్నాయని చెప్పింది. అతనితోనే కాదు.. మెగా హీరోలతో నటించే అవకాశాలన్నీ వాటికవే వస్తున్నాయే తప్ప.. వేరొకటి కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెజీనా మనోజ్-దశరథ్, గోపిచంద్-రానా కాంబినేషన్లో వచ్చే కొత్త సినిమాల్లో నటించనుంది. కాగా మెగా హీరో సాయిధరమ్ తేజతో రెజీనా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌లో నటించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి