ఈ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల కోసం అమెరికా దేశమంతా చుట్టేస్తోందీ బ్యూటీ. ఈ సీరియల్లో ప్రియాంక చోప్రానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మొత్తం టీవీ షోలో ప్రియాంక మాత్రం ఇరగదీసిందని టాక్ వస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా కేరెక్టర్ పేరు అలెక్స్ పారిష్. ఈమె ఎఫ్‌బీఐలో పని చేస్తుందన్నమాట.
తన పాత్రకు రెస్పాన్స్ అదిరిపోవడంతో ప్రియాంక చోప్రా అదరగొట్టేసింది. దీనికి తోడు సోదరి పరిణీతి చోప్రా, సహ హీరోయిన్స్ దీపికా, అలియా భట్, సోనాక్షి, అనుష్క శర్మలు ప్రియాంకకు అభినందలు తెలపడంతో ప్రియాంక చోప్రా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.