రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌‌గా లార్డ్ శివ క్రియేషన్స్ చిత్రం

శుక్రవారం, 10 జూన్ 2016 (15:50 IST)
లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్‌పై సాక్షిచౌదరి ప్రధాన తారాగణంగా పర్వీన్ రాజ్, పూజిత హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేషసాయి మరుప్రోలు మాట్లాడుతూ సినిమా చిత్రీకరణలో భాగంగా రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. 
 
మొదటి షెడ్యూల్‌లో పర్వీన్ రాజ్, పూజితల మీద మంచి లోకేషన్స్‌లో సాంగ్ చిత్రీకరించాం. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ప్రధానపాత్రలో నటిస్తున్న సాక్షిచౌదరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూన్ నెలాఖరుకు ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ప్రస్తుత సమాజంలో యువత ఎలా ఉందనే కాన్సెప్ట్‌పై రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను చిత్రీకరిస్తున్నట్టు చెప్పారు.
 
నిర్మాత ఎం.వి.ఎస్.సాయికృష్ణా రెడ్డి మాట్లాడుతూ ‘’నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సాక్షిచౌదరి ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు షెడ్యూల్‌లో ఆమెపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నాం’’ అన్నారు. 
 
ఈ చిత్రంలో సాక్షిచౌదరి, పర్వీన్ రాజ్, పూజిత, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాకేష్, సంతోష్, ఇంద్ర, అవంతిక, అక్షర, శ్రావణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, సంగీతం: కిషన్ కవాడియా, కెమెరా: కె.శంకరరావు, నిర్మాత: ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి, రచన, దర్శకత్వం: శేషసాయి మరుప్రోలు.

వెబ్దునియా పై చదవండి