రెండో పెళ్ళికి సిద్ధమవుతున్న ఐశ్వర్య రజనీకాంత్?

శుక్రవారం, 14 జులై 2023 (10:18 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఇపుడు రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఓ హీరోతో ఆమె చాలా సన్నిహితంగా ఉండటంతో రెండో పెళ్ళి అంశంపై తెరపైకి వచ్చింది. వీరిద్దరూ ఓ రిసార్ట్ వద్ద అతడితో కనిపించినట్టు తెలిపారు. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలిసినప్పటికీ సినీ అభిమానులు దృష్టి మారోమారు ఐశ్వర్యపై పడింది. 
 
గత యేడాది ఐశ్వర్య, హీరో ధనుష్ విడాకులు ఇచ్చేసిన విషయం తెల్సిందే. 18 యేళ్ళ వైవాహిక బంధానికి వారు ముగింపు పలికారు. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి విడిగా ఉంటుంది. ఐశ్వర్వ, ధనుష్ మళ్లీ ఒక్కటికానున్నారని వార్త ఇటీవల వైరల్ అయినా వారు మాత్రం ఈ విషయమై మౌనాన్ని ఆశ్రయించారు. 
 
తాము ఎందుకు విడిపోయిందీ ఐశ్వర్య, ధనుష్ ఇప్పటివరకూ బయటపట్టలేదు. అయితే, సూచీ లీక్స్ ధనుష్‌ ఫోటో బయటకు వచ్చిన నాటి నుంచీ వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని టాక్. అవి ముదిరి చివరకు విడాకులు దారితీశాయట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు