"ఆర్ఎక్స్100" మూవీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్‌పై సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె క్యారెక్టర్‌లో జీవించిందంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు హీరోయిన్లు తిరస్కరించిన క్యారెక్టర్‌ను చేసేందుకు ముందుకు వచ్చిన ఈ కుర్రపిల్ల.. బోల్డ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుందని వ్యాఖ్యానించింది.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అజయ్ భూపతి "ఆర్ఎక్స్ 100" అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. మొదటి చిత్రంతోనే తన ప్రతిభను చూపించి అందరకు అవాక్కయ్యేలా చేశాడు. జూలై 12న విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మధ్య రొమాన్స్ యువతకి బాగా కనెక్ట్ అయింది.
ముఖ్యంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కేవలం తన గ్లామర్‌తోనే కాక బోల్డ్ క్యారెక్టర్‌లో జీవించింది. ఒకవైపు కోరికతో రగిలిపోతూ, లోలోపల కుట్రలు చేయడం సినీ ప్రేక్షకలోకానికి కొత్తగా అనిపించింది. ఇక లిప్ లాక్ సీన్స్‌లోనూ ఈ అమ్మడు అదరగొట్టింది. పాయల్ పాత్రని ఎంతో మంది రిజెక్ట్ చేసిన డేరింగ్‌గా తాను ముందుకు వచ్చి ఇచ్చిన పాత్రకి న్యాయం చేసిందని సినీ జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.