'బాహుబలి' చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో' కావడంతో ఇటు సినీ ఇండస్ట్రీలోనూ, అటు ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సాహో రెండో మేకింగ్ వీడియోను ఆదివారం హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేశారు.
అన్ని భాషల్లో రిలీజ్ చేసిన వీడియోలు అన్నింటికీ కలిపి ఈ వ్యూస్ వచ్చినట్లు సాహో టీమ్ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా నిర్మిస్తున్నారు.