టైగర్3 ట్రైలర్ రిలీజ్ డేట్‌ని, సినిమా విడుదల తేదీని తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ల ద్వారా మరోసారి కన్‌ఫర్మ్ చేశారు యష్ రాజ్ ఫిల్మ్స్. యష్‌రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న స్పై సినిమాలంటే అందరిలోనూ అదో మాదిరి ఇష్టం పెరిగిపోయింది. ఇటుకా ఇటుకా పేర్చినంత అద్భుతంగా స్పై యూనివర్శ్‌ని బిల్డ్ చేస్తున్నారు యష్ రాజ్ ఫిల్మ్స్.
వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్‌లో తదుపరి రాబోయే అత్యద్భుతమైన సినిమా టైగర్3. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటిస్తున్న సినిమా ఇది. ఇండియన్ సినిమా మునుపెన్నడూ చూడనంత అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత ఏక్ థా టైగర్ (2012)... మూవీ ఓజీ టైగర్ అలియాస్ సల్మాన్ ఖాన్‌దే. వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్‌లో అందుకే ఎప్పటికీ సల్మాన్‌కి సూపర్‌డూపర్ ప్లేస్ ఉంటుంది.
ఏక్‌థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు సాధించిన సక్సెస్ చూసిన తర్వాత ఆదిత్య చోప్రాకి ఈ జోనర్ మీద నమ్మకం అమాంతం పెరిగింది. ఆ విశ్వాసం నుంచి పుట్టినవే కబీర్ అలియాస్ హృతిక్ రోషన్ వార్, పఠాన్ అలియాస్ షారుఖ్‌ఖాన్ పఠాన్.
పఠాన్ సమయంలోనే వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్ గురించి ఈ ఫ్రాంఛైజీ లోగో గురించి ప్రకటించారు ఆదిత్యా చోప్రా. వై ఆర్ ఆఫ్ స్పై యూనివర్శ్‌లో క్రాస్ ఓవర్ కేరక్టర్ల గురించి కూడా పఠాన్ సమయంలోనే ప్రకటించారు. క్రాస్ ఓవర్ కేరక్టర్ల ప్రాజెక్టుగా పఠాన్ మెటీరియలైజ్ అయింది. సల్మాన్ ఖాన్‌నీ, షారుఖ్ ఖాన్‌ని, యాక్షన్ సీక్వెన్స్ లో పఠాన్ స్క్రీన్స్ మీద చూసిన వారికి అడ్రినలైన్ పంపింగ్ మామూలుగా లేదు. సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ టైమ్ అని అందరూ సూపర్‌డూపర్ ఎంజాయ్ చేశారు. ఇద్దరు సినిమాటిక్ ఐకాన్స్ ని స్క్రీన్స్ మీదకు తీసుకొచ్చిన స్పై సినిమాగా పఠాన్ రేరెస్ట్ రికార్డుని క్రియేట్ చేసుకుంది.