"రంగస్థలం".. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రాంచరణ్‌తో పాటు అతని సరసన హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. మొదట్లో నెమ్మదిగా షూటింగ్ ప్రారంభించినా తర్వాత వేగంగా తీసుకెళుతున్నారు దర్శకుడు సుకుమార్. గ్యాప్ లేకుండా షూటింగ్ బిజీలో సినిమా యూనిట్ ఉంది. అయితే రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్‌లో హీరోయిన్ సమంత చేతికి గాయమైంది. ప్రస్తుతం కట్టుతోనే సమంత షూటింగ్‌కు వెళుతోందట. అసలేమైందంటే.
రాజమండ్రిలో రాంచరణ్, సమంతల మీద ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో సమంత చేతిని తొక్కేశారు హీరో రాంచరణ్. దీంతో ఆమె చేతికి గాయమైంది. నరం బాగా చిట్లిందని వైద్యులు గుర్తించారు. అలాగే ఎముక కూడా పక్కకు వెళ్ళిందట. దీంతో సమంత కట్టు కట్టుకుని చేతిని కాపాడుకుంటోంది. షూటింగ్ సమయంలో మాత్రం కట్టు తీసి అయిపోయిన తర్వాత యధావిధిగా కట్టుతోనే ఇంటికి వెళుతోందట. అయితే తనకు దెబ్బ తగలడానికి కారణం రాంచరణ్ అన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని సినీ యూనిట్‌కు విజ్ఞప్తి చేసిందట.